News August 3, 2024

దెందులూరులో రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

ఏలూరు జిల్లా దెందులూరు-అలుగులగూడెం మధ్య రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని 30 ఏళ్ల వయసు గల వ్యక్తిని ట్రైన్ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 14, 2025

పాలకొల్లులో వైసీపీ రాష్ట్ర నేతకు సీఐడీ నోటీసులు

image

వైసీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళకు సీఐడీ అధికారులు పాలకొల్లులో నోటీసులు అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో 2022లో పాలకొల్లు టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ కేసు దర్యాప్తులో భాగంగా తనకు ఈ నోటీసులు ఇచ్చారని, ఈ నెల 15న రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నట్లు చంద్రకళ తెలిపారు.

News December 13, 2025

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి: కలెక్టర్

image

గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం ఎస్ఆర్ కె‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా నేటి నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు.

News December 13, 2025

నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

image

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.