News March 28, 2025
దెందులూరు: ఆటో బైక్ ఢీ.. ఒకరు మృతి

దెందులూరులో శుక్రవారం సాయంత్రం వాహనం ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో దెందులూరు గ్రామానికి చెందిన కొల్లాబత్తిన ఏసు (35) అక్కడికక్కడే మృతి చెందాడు. గుంపుల వంశీకి తీవ్రగాయాలయ్యాయి. ఏసు, వంశీ బైక్పై దెందులూరు నుంచి రైల్వే గేట్ వైపు వెళ్తున్నారు. ఆటో దెందులూరు వైపు వస్తుంది. మూడు తూరలు మలుపు వద్ద రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దెందులూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 18, 2025
శ్రీశైలంలో దసరా ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

శ్రీశైలంలో ఈనెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తూ గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్దా రాజశేఖర్ రెడ్డి, కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ యుగంధర్ రెడ్డి తదితరులు సీఎంను కలిసి ఆహ్వాన పత్రికతో పాటు మల్లన్న ప్రసాదాన్ని అందజేశారు.
News September 18, 2025
కృష్ణా: ‘స్వచ్ఛతాహి సేవ’పై సమీక్ష

కలెక్టర్ డి.కె. బాలాజి గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమై ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, డ్వామా, రహదారులు-భవనాల శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం, ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.
News September 18, 2025
అసెంబ్లీ సమావేశాలు కుదింపు

AP: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల పనిదినాలను ప్రభుత్వం 8 రోజులకు కుదించింది. ఈనెల 27 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత అసెంబ్లీని ఈనెల 30 వరకు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో <<17749258>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే. అటు రేపు మధ్యాహ్నం రూ.1.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.