News April 29, 2024
దెందులూరు: చింతమనేని సెంటిమెంట్ ఏంటో తెలుసా..?
దెందులూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో ఖాకీ దుస్తులు ధరించడం సెంటిమెంట్. నందమూరి తారక రామారావు తన తొలి రాజకీయ ప్రచారంలో ఖాకీ దుస్తులు ధరించి సక్సెస్ అయ్యారని అందుకే ఇలా ప్రచారం చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. అంతేకాకుండా 2009లో చింతమనేని తొలిసారి MLAగా పోటీచేసినప్పుడు ప్రచారం చేసేందుకు వచ్చిన జూనియర్ NTR సైతం ఖాకీ దుస్తుల్లోనే ప్రచారం చేశారు.
Similar News
News November 13, 2024
ప.గో: గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించే వారోత్సవాలకు సంబంధించి గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్ర గ్రంధాలయం సంస్థ కార్యదర్శి యం.శేఖర్ బాబు ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవంతో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
News November 12, 2024
ఏలూరు: జిల్లా జైల్‌ను పరిశీలించిన ఎస్పీ
ఏలూరు జిల్లా జైల్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ పరిశీలించారు. జైల్‌లో ముద్దాయిలకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి క్షేత్రస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడుతూ ఖైదులు సత్ప్రవర్తనతో మేలగాలని సూచించారు. జైలు నుంచి బయటకు వచ్చినవారి జీవనోపాధి కోసం పోలీసు వారు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాన్ని కల్పిస్తామని తెలిపారు.
News November 12, 2024
ప.గో: వివాహితపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
గోపాలపురం మండలంలో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI సతీశ్ కుమార్ మంగళవారం తెలిపారు. SI వివరాల మేరకు..ఈ నెల 9న సదరు మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటంతో అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. దీనిపై సోమవారం రాత్రి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. నిందుతుడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.