News February 14, 2025
దెందులూరు: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

వట్లూరులో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డ్రైవర్ సుధీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై గురువారం కేసు నమోదైంది. ఆయనతో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. అందులో అబ్బయ్య చౌదరిని A1 గా పెట్టారు. చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరి వివాదం ముదురుతోంది.
Similar News
News October 26, 2025
ఇందిరమ్మ ఇళ్లు: చెల్లింపుల్లో స్వల్ప మార్పులు

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బేస్మెంట్ వరకు రూ.లక్ష, రూఫ్ లెవల్ వరకు రూ.లక్ష, శ్లాబ్ వేశాక రూ.2 లక్షలు, చివర్లో రూ.లక్ష చొప్పున 4 విడతల్లో రూ.5 లక్షలిస్తున్నారు. ఇక నుంచి శ్లాబ్ వేశాక రూ.1.40 లక్షలే ఖాతాలో జమ అవుతాయని మంత్రి చెప్పారు. మిగతా రూ.60 వేలను ఉపాధి హామీ పథకం కింద ఇస్తామన్నారు.
News October 26, 2025
రేపు కూడా పాఠశాలలకు సెలవు: డీఈవో

తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీమ్ భాషా ఆదివారం తెలిపారు. సోమవారంతో పాటు మంగళవారం, బుధవారం కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించిన సంగతి విధితమే అన్నారు. అన్ని పాఠశాలలు దీన్ని గమనించాలని ఆయన సూచించారు.
News October 26, 2025
అల్వాల్లో యాక్సిడెంట్.. మహిళ మృతి

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ వెళుతున్న దంపతులను వెనకనుంచి వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనూష అక్కడిక్కడే మృతి చెందింది. భర్తకు గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన బస్సు కరీంనగర్కు చెందిన ఎలక్ట్రిక్ బస్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


