News February 14, 2025
దెందులూరు: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

వట్లూరులో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డ్రైవర్ సుధీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై గురువారం కేసు నమోదైంది. ఆయనతో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. అందులో అబ్బయ్య చౌదరిని A1 గా పెట్టారు. చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరి వివాదం ముదురుతోంది.
Similar News
News March 16, 2025
మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 4,141 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
News March 16, 2025
తంగళ్ళపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముందస్తు అరెస్ట్

కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీని సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాట్ల మధు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్న విషయం తెలిసిందే. సవాల్ కోసం సిరిసిల్లకు చేరుకున్న టోనీని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతి భద్రతల దృష్ట్యా తంగళ్లపల్లిలో మధును, సిరిసిల్లలో టోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
News March 16, 2025
పెద్దపల్లి: 30న అఖిల భారత యాదవ మహాసభ

ఈనెల 30వ తేదీన అఖిల భారత యాదవ మహాసభ నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మహాసభలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల కోసం ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు.