News January 27, 2025
దెందులూరు: మృతుల వివరాల గుర్తింపు

దెందులూరు మండలం పోతునూరు పరిధిలో హైవేపై ట్రాక్టర్ను కంటైనర్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. మృతులు ఉండి మండలం ఉప్పులూరుకు చెందిన డొల్లా జోషి(40), బోడా చందు(22)గా గుర్తించారు. ఇదే ప్రమాదంలో ఈలి సన్నీ అనే వ్యక్తి, కంటైనర్ డ్రైవర్కు గాయాలయ్యాయి. ట్రాక్టరు ఏలూరు నుంచి ఉప్పులూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Similar News
News November 28, 2025
కంపు కొడుతున్న BHPL మున్సిపాలిటీ..!

BHPL మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో చెత్త పేరుకుపోయి కంపు కొడుతోంది. ఇటీవల బొల్లిరాజయ్య అనే మున్సిపల్ కార్మికుడు విధినిర్వహణలో మృతిచెందాడు. దీంతో మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. అలాగే, చెత్త సేకరణకు సరిపడా వాహనాలు లేవని శానిటేషన్ ఇన్స్పెక్టర్ నవీన్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అందుకే చెత్త సేకరించట్లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 28, 2025
అమరావతిలో 15 బ్యాంకులు.. 6541 ఉద్యోగాలు

AP: రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థలు తమ <<18408811>>కార్యాలయాలు<<>> ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందుకోసం రూ.1,328 కోట్లు వెచ్చించనుండగా 6,541 ఉద్యోగాలు రానున్నాయి. సంస్థల జాబితా ఇదే.. APGB, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాబ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, కెనరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, BOB, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, PNB, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, IDBI, LIC, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.
News November 28, 2025
నల్గొండ: సోషల్ మీడియాపై ఎస్పీ ప్రత్యేక నిఘా

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సోషల్ మీడియా కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, లేక ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూసినా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని ఆయన స్పష్టం చేశారు.


