News April 10, 2025
దెందులూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

దెందులూరు మండలం కొమరేపల్లి జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని, స్విఫ్ట్ డిజైర్ కార్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఒకరు మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ధర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 4, 2025
వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,920 పలకగా.. నేడు రూ. 30 పెరిగి, రూ.6,950 అయినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. మార్కెట్కు సుమారు 12 వేల పత్తి బస్తాలు వచ్చినట్లు చెప్పారు. కాగా వర్షం కారణంతో మార్కెట్లో కొనుగోళ్లకు అంతరాయం కలిగింది.
News November 4, 2025
ఫ్లాప్స్ వచ్చినా ఆఫర్లకు కొదవలేదు..

హిట్టు, ఫ్లాప్తో సంబంధం లేకుండా హీరోయిన్ శ్రీలీల హవా కొనసాగుతోంది. పెళ్లి సందడితో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ధమాకా, భగవంత్ కేసరి వంటి హిట్లు ఖాతాలో వేసుకున్నారు. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం, మాస్ జాతర అలరించలేకపోయాయి. 10కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి సక్సెస్ రేట్ 30శాతమే ఉంది. ప్రస్తుతం శ్రీలీల 3-4 సినిమాల్లో నటిస్తున్నారు.
News November 4, 2025
‘Admin123’.. అంతా కొట్టేశాడు!!

గుజరాత్ హ్యాకర్ పరిత్ ధమేలియా 2024లో ఢిల్లీ, నాసిక్, ముంబై తదితర నగరాల్లో 50K CCTV క్లిప్స్ తస్కరించాడు. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లోని ఈ క్లిప్స్ పోర్న్ మార్కెట్లో అమ్మేశాడు. మొదట రాజ్కోట్ పాయల్ ఆస్పత్రిలో గైనకాలజీ టెస్ట్స్ ఫుటేజ్ కోసం CCTV హ్యాక్ చేస్తే పాస్వర్డ్ Admin123 అని తెలిసింది. ఇదే పాస్వర్డ్తో ఇతర నగరాల్లోనూ హ్యాక్ చేశాడు. ఈ Febలో అరెస్టైన పరిత్ నేర వివరాలు తాజాగా బయటకొచ్చాయి.


