News April 10, 2025
దెందులూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

దెందులూరు మండలం కొమరేపల్లి జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని, స్విఫ్ట్ డిజైర్ కార్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఒకరు మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ధర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 11, 2026
వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణ మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణ క్రతువును జరిపించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. భక్తులు స్వామివారి కళ్యాణం కనులారా వీక్షించి తరించారు.
News March 11, 2026
మెదక్: LOVER❤️ బెదిరింపుతో సూసైడ్

అల్లాదుర్గం(M)అప్పాజీపల్లికి చెందిన రూప(21) ప్రియుడి బెదిరింపులతో ఆత్మహత్య చేసుకుంది. HYDలో పనిచేస్తున్న రూపకు మరో యువకుడితో వారం క్రితం నిశ్చితార్థం జరగడంతో, ప్రియుడు ఆమెకు ఫోన్ చేసి తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటే అంతు చూస్తానని బెదిరించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురై రూప సోమవారం చెరువులో దూకగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 11, 2026
అంగీకారంతో జరిగితే దాన్ని రేప్ అనలేం: కర్ణాటక హైకోర్టు

అంగీకారంతో కొన్నేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉండి ఆపై పెళ్లికి నిరాకరిస్తే రేప్‌గా పరిగణించలేమని కర్ణాటక HC స్పష్టం చేసింది. ‘‘చట్టం ప్రకారం ‘హార్ట్‌బ్రేక్’ నేరం కాదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పైగా విదేశాల్లో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే అది మోసం కిందకు రాదంటూ నిందితుడిపై కేసును కొట్టివేసింది. కేవలం పెళ్లి చేసుకోలేదన్న కారణంతో అంగీకారంతో కూడిన బంధాన్ని రేప్‌గా మార్చలేమని కోర్టు తేల్చిచెప్పింది.


