News September 27, 2024
దెందులూరు: వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి
దెందులూరు మండలం చల్ల చింతలపూడిలో గురువారం రాత్రి విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక చవితి పురస్కరించుకొని విగ్రహ నిమజ్జనంలో గ్రామానికి చెందిన సింహాద్రి అయ్యప్ప(28) పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు స్థానిక చెరువులో గల్లంతయ్యాడు. వెలికి తీసిన తోటి వారు హుటాహుటిన భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు.
Similar News
News October 10, 2024
ఏలూరు జిల్లాకు 3 టన్నుల రాయితీ టమాటాలు
ఏలూరు జిల్లాకు మూడు టన్నుల రాయితీ టమాటాలు దిగుమతి చేయడం జరిగిందని బుధవారం మార్కెటింగ్ శాఖ అధికారులు తెలియజేశారు. ఇందులో భాగంగా ఏలూరు నగరంలోని పత్తేబాద రైతు బజారుకు 1.50 టన్నులు, ఒకటో పట్టణ రైతు బజారుకు 750 కిలోలు, కైకలూరు రైతు బజారుకు 500 కిలోలు చొప్పున కేటాయించినట్లు తెలిపారు. కిలో రూ.50 కి అమ్ముతారని, ప్రజలు గమనించాలని కోరారు.
News October 10, 2024
యర్నగూడెం జాతీయ రహదారిపై మంత్రి తనిఖీలు
దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో బుధవారం రాత్రి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. యర్నగూడెం జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద లోడుతో వెళుతున్న లారీలను ఆపి పత్రాలను పరిశీలించారు. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం అక్రమాలపై దృష్టి సారించిన మంత్రి మనోహర్ ఈ మేరకు తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
News October 10, 2024
పెదవేగి: ముగ్గురి ప్రాణం తీసిన పందెంకోడి..UPDATE
పెదవేగిలో తండ్రి, ఇద్దరు కుమారులు <<14312151>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. కోడిపుంజుకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి, ఇద్దరు కుమారులు కాలువలో పడి మృతి చెందారు. ఈ ఘటనలో మొదట తండ్రి, పెద్ద కుమారుడి మృతదేహం లభ్యం కాగా..ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బురదలో కూరుకుపోయిన సాయికుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోవడంతో తల్లి ఆవేదన ఆకాశాన్నంటుతోంది.