News January 27, 2025
దెందులూరు: హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

ఏలూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. దెందులూరు(M) పోతులూరి సమీపంలో హైవేపై వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెదవేగి సీఐ వెంకటేశ్వరరావు, దెందులూరు ఎస్ఐ శివాజీ మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉండి మండలం ఉప్పులూరుకు చెందిన వారని తెలుస్తోంది.
Similar News
News February 27, 2026
SKLM: ‘డయేరియా బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం’

డయేరియా వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైనా ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవను పొందవచ్చని శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యశ్రీ డైరెక్టర్ డాక్టర్ పీస అవని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్ క్లినిక్‌లకు వెళ్లిన వారు తమను సంప్రదిస్తే ఉచితంగా వైద్యం అందించటం జరుగుతుందన్నారు. రిమ్స్, జేమ్స్, మెడికవర్, కిమ్స్, సింధూర ఏవన్ ఆసుపత్రులకు పంపించి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.
News February 27, 2026
NZB: విశ్రాంత ఉద్యోగులు అండగా నిలవడం అభినందనీయం: మంత్రి జూపల్లి

కష్టకాలంలో సహోద్యోగి కుటుంబానికి <<19254682>>విశ్రాంత ఉద్యోగులు అండ<<>>గా నిలవడం అభినందనీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబానికి ఇప్పటికే రూ.కోటి సాయం, ఉద్యోగం ఇచ్చామన్నారు. ఎక్సైజ్ సిబ్బంది కృషిని ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు. సిబ్బందికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News February 27, 2026
హీరో విజయ్ భార్య సంగీత నేపథ్యమిదే..

తమిళ స్టార్ హీరో విజయ్ <<19254560>>భార్య సంగీత<<>> శ్రీలంక తమిళ ఫ్యామిలీకి చెందిన మహిళ. ఈమె తండ్రి యూకేలో వ్యాపారవేత్త కావడంతో ఆమె అక్కడే జన్మించారు. అభిమానిగా విజయ్‌కు సంగీత పరిచయమయ్యారు. ఆపై వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి 1999లో పెళ్లి చేసుకున్నారు. విజయ్ దంపతులకు జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలున్నారు. లోప్రొఫైల్ మెయింటెన్ చేసే ఈమె భర్తకు సంబంధించిన సినిమా, పొలిటికల్ ఈవెంట్లలోనూ పెద్దగా కనిపించరు.


