News January 27, 2025
దెందులూరు: హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

ఏలూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. దెందులూరు(M) పోతులూరి సమీపంలో హైవేపై వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెదవేగి సీఐ వెంకటేశ్వరరావు, దెందులూరు ఎస్ఐ శివాజీ మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉండి మండలం ఉప్పులూరుకు చెందిన వారని తెలుస్తోంది.
Similar News
News February 13, 2025
పాలకుర్తి: తండ్రికి తల కొరివి పెట్టిన ఐదేళ్ల చిన్నారి

జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన నాగన్న(30) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అభం శుభం తెలియని తన కూతురు రితీక(5) ‘నాన్న లే నాన్నా’ అంటూ బుధవారం కుటుంబ సభ్యుల సమక్షంలో నాగన్న చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన చూసిన గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు.
News February 13, 2025
సీఎంఆర్ బియ్యం ఇవ్వకుంటే చర్యలు: పౌరసరఫరాల శాఖ

బకాయి సీఎంఆర్ బియ్యం ఇవ్వకుంటే ఆస్తులు జప్తు చేస్తామని వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ డిఎం జగన్మోహన్ హెచ్చరించారు. సీఎంఆర్ బియ్యం ఇవ్వని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం మిల్లు యజమాని, మిల్లుకు జామీను ఉన్న వారి ఆస్తులు జప్తు చేస్తామని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లర్లు నడుచుకోవాలని అన్నారు. లేదంటే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 13, 2025
ములుగు జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

ములుగు జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి.. క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యామ్‌లు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్ర ఎలా ఉందో కామెంట్ చేయండి.