News March 8, 2025

దేమకేతేపల్లిలో ఈ-క్రాప్ చెకింగ్

image

చిలమత్తూరు మండల పరిధిలోని దేమకేతేపల్లిలో రైతు అంజినప్పకు చెందిన వరి పంటను గతంలో వ్యవసాయ శాఖ అధికారులు ఈ క్రాప్ బుకింగ్ చేశారు. ఆ పొలంలో వరి పంటను జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ శుక్రవారం సూపర్ చెక్ చేశారు. ఈ సందర్భంగా రైతులు వరి పంటను మరింత విస్తృత పరిచే విధంగా చైతన్య పరచాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అనంతరం రైతు అంజినప్ప రాగి పంట సాగుపై చర్చించారు. ఏడిఏ అల్తాఫ్ ఆలీఖాన్ ఉన్నారు.

Similar News

News November 17, 2025

సిరిసిల్ల: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన రైతు అంబిరీ లింగం(65) కరెంట్ షాక్‌తో ఆదివారం మృతి చెందాడు. లింగం కుమారుడు అంబిరీ పూర్ణ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన లింగం ఎంతకీ ఇంటికి తిరిగిరాలేదు. పొలం వద్దకు వెళ్లి చూడగా, మోటార్ స్టార్టర్ బాక్స్ వద్ద కరెంట్ షాక్ తగిలి పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు.

News November 17, 2025

పెద్దపల్లి: బైక్ అదుపుతప్పి బాలిక మృతి

image

PDPL(D) పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కింద పడటంతో ఓ బాలిక మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం మండలం బోట్లవనపర్తికి చెందిన కత్తెర్ల లక్ష్మణ్ తన భార్య, ఇద్దరు కూతుళ్లతో ఇంటికి వెళ్తున్న క్రమంలో కాసులపల్లి వద్ద బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ క్రమంలో పెద్దకూతురు సాయిపావని(13) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

News November 17, 2025

నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’ ఇదే

image

విశ్వంలో శని గ్రహానికి అందమైన గ్రహంగా పేరుంది. దాని చుట్టూ ఉండే అందమైన వలయాలే దీనికి కారణం. ఆ వలయాలకు సంబంధించిన ఫొటోను నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’గా తన సైట్‌లో పేర్కొంది. కాసిని స్పేస్ క్రాఫ్ట్ 2004-2017 మధ్య సాటర్న్ చుట్టూ తిరుగుతూ రింగ్స్‌ను చిత్రీకరించింది. ఆ ఇమేజ్‌ల నుంచి పై ఫొటోను డిజిటల్‌గా క్రాప్ చేశారు. బ్లూ కలర్‌లో కనిపించేది రింగ్ ప్లేన్. డార్క్ షాడోస్‌లో ఉన్నవి వలయాల నీడలు.