News June 21, 2024

దేవరకద్రలో డిగ్రీ కళాశాల ఏర్పాటు

image

దేవరకద్రలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కళాశాల భవన నిర్మాణం, ఇతర అవసరాల కోసం రూ.11 కోట్లను మంజూరు చేశారు. రూ.6.10 కోట్లతో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

Similar News

News December 4, 2025

పీయూలో ఎన్ఎస్ఎస్ ఒరియంటేషన్ కరపత్రం ఆవిష్కరణ

image

డిసెంబర్ 10న పాలమూరు యూనివర్సిటీలో Challenges Facing by Women and Youth అంశంపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ఒరియంటేషన్ కార్యక్రమం జరుగనుందని వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ తెలిపారు. బ్రోచర్‌ను రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. ముఖ్య వక్తగా మెల్‌బోర్న్‌ నుంచి BYM ఫౌండర్ ప్రొఫెసర్ సరోజ గుళ్లపల్లి పాల్గొననున్నారు. కోఆర్డినేటర్ డా ప్రవీణ, పీవో డా.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

News December 4, 2025

MBNR: పొగమంచు సమయంలో జాగ్రత్తలే రక్షణ–ఎస్పీ

image

చలికాలం ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా ఉదయం,రాత్రి వేళల్లో పొగమంచు తీవ్రంగా ఏర్పడుతున్న నేపథ్యంలో రోడ్లపై దృష్టి తగ్గడం, ముందున్న వాహనాల దూరం అంచనా కష్టపడడం వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున, ప్రమాదాలు నివారించడం కోసం డ్రైవర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పొగమంచు వలన రోడ్డు, సిగ్నల్స్, వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరగవచ్చని పేర్కొన్నారు.

News December 4, 2025

MBNR: ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. వేటు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. 3 విడుదల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కఠిన నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు సర్పంచ్, వార్డు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, గోపాలమిత్రాలు, సీసీలు వంటి వర్గాలు ఏ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగం పోతుంది. జాగ్రత్త సుమా..!