News June 21, 2024
దేవరకద్రలో డిగ్రీ కళాశాల ఏర్పాటు
దేవరకద్రలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కళాశాల భవన నిర్మాణం, ఇతర అవసరాల కోసం రూ.11 కోట్లను మంజూరు చేశారు. రూ.6.10 కోట్లతో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
Similar News
News September 9, 2024
ప్రజలకు విజ్ఞలు తొలగి విజయం కలగాలి: డిఐజి చౌహన్
మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు మొదలుపెట్టిన పనులలో ఎలాంటి విఘ్నాలు లేకుండా.. అన్నింటా విజయం సాధించాలని జోగులాంబ జోన్ -7 డిఐజి ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. ఆయన స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు సురక్షా వినాయక విగ్రహంకు జిల్లా ఎస్పీ జానకి, అదనపు ఎస్పీ రాములు లతో గణనాథునికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
News September 9, 2024
రాష్ట్రంలో 80వేల ఎకరాల వక్ఫ్ భూములు: డీకే అరుణ
తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పరిధిలో సుమారు 80వేల ఎకరాల భూములు ఉన్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సవరణలు చేపట్టిందన్నారు. ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో నెలాఖరున జేపీసీ పర్యటన ఉంటుందన్నారు.
News September 9, 2024
MBNR: అక్రమాలపై ప్రత్యేక హైడ్రా ఫోకస్.!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హైడ్రా ప్రకంపనలు మొదలయ్యాయి. CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్వే, భూ దస్త్రాల శాఖ అప్రమత్తమైంది. పురపాలక సంఘాల్లో, గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి ఏ రోజుకు ఆ రోజు నివేదిక రూపంలో సాయంత్రం 4 గంటల వరకు కమిషనర్‌కు మెయిల్ పంపించాలని ఆదేశించారు. నివేదిక ఎలా ఇవ్వాలో నమూనాను కూడా పంపించారు. ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది.