News November 3, 2024
దేవరకద్ర: ఎట్టకేలకు 27వ దొంగతనానికి దొరికిపోయారు
ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో 26 సార్లు పశువుల దొంగతనానికి పాల్పడిన దొంగలు 27వ సారి దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. లింగాల, నందికొట్కూర్, కోరుకొండ, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన పలువురు దొంగలు గత కొంతకాలంగా కల్వకుర్తి, దేవరకద్ర, తాండూర్, తిమ్మాజీపేట, జడ్చర్ల, భూత్పూర్ తదితర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.
Similar News
News December 8, 2024
ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. గత 3 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగాNRPT జిల్లాలోని దామరగిద్ద మండల కేంద్రంలో 12డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12.0నుంచి 26.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News December 8, 2024
‘నిబంధన నామమాత్రమే.. క్రీడల్లో రాణించేది మనమెప్పుడు’
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,227 ప్రభుత్వ పాఠశాలలుంటే 3.50 లక్షల మంది విద్యార్థులు, 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా..17,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 275 మంది PEDలు, 45 మంది PETలు మాత్రమే ఉన్నారు.250 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండాలన్న నిబంధన నామమాత్రమే. ప్రభుత్వం క్రీడలపై దృష్టి పెట్టి వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కోరుతున్నారు.
News December 8, 2024
వనపర్తి: వాలీబాల్ ఆడుతూ టెన్త్ విద్యార్థి మృతి
వనపర్తి జిల్లాలో జరిగిన సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. పెద్దమందడి మం. ముందరితండాకు చెందిన సాయి పునీత్(15) బలిజపల్లి స్కూల్‌లో టెన్త్ చదువుతున్నాడు. పోటీల్లో భాగంగా వాలీబాల్ ఆడుతూ పునీత్ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతిచెందిటన్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు.