News July 11, 2024
దేవరకద్ర: బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎంపీకి వినతి పత్రం

మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొంది తొలిసారి దేవరకద్రలో కృతజ్ఞత సభకు విచ్చేసిన డీకే అరుణకి కొండ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా స్వాగతం పలికి శాలువ కప్పి సన్మానం చేశారు. అనంతరం దేవరకద్రలోని వ్యాపారస్తులు అందరు కలిసి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎంపీకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎగ్గని నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 14, 2025
MBNR: నేటి నుంచి మహానగరోత్సవం

జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నేడు, రేపు ‘మన మహబూబ్ నగర్ మన మహానగరోత్సవం’ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌గా ఏర్పాటైనా సందర్భంగా నగర ప్రముఖులు, ప్రజలందరూ వారి అనుభవాలు మహానగరోత్సవం వేదికగా వ్యక్త పరచనున్నారు. ప్రముఖ నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
News February 14, 2025
బిజినేపల్లి: అనుమానాస్పదంగా మహిళ మృతి

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో అనుమానాస్పదంగా మహిళ మృతి చెందింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నమ్మ(55) బుధవారం రాత్రి భర్త సుల్తాన్ పొలానికి వెళ్లగా ఒంటరిగా పడుకుంది. ఉదయం భర్త ఇంటికి వచ్చిన సమయంలో ఆమె గాయాలతో ఉంది. వెంటనే నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బిజినేపల్లి ఎస్ఐ తెలిపారు.
News February 14, 2025
మహబూబ్‌నగర్ RTC బస్సుకు రోడ్డు ప్రమాదం

మహబూబ్‌నగర్ డిపోకు చెందిన బస్సుకు షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులోని పోచమ్మ ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు యూటర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.