News March 29, 2024
దేవరకద్ర: రూ.8 లక్షల 40 వేలు పట్టివేత

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. నేడు మరికల్ మండలం లాల్ కోట చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. దేవరకద్ర మండలం గురకొండకి చెందిన బిరప్ప రూ.8 లక్షల 40 వేలు కారులో తీసుకెళ్తుండగా సీజ్ చేసి ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామన్నారు. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలు వెంట ఉండాలన్నారు.
Similar News
News February 8, 2026
MBNR: రేపటితో ముగియనున్న ప్రచారం

ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్,18మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 3న మొదలైన ఎన్నికల ప్రచార హోరు రేపు సాయంత్రం ముగియనుంది. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 5నుంచి 6కార్నర్ మీటింగ్ లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంచేస్తున్నారు.
News February 8, 2026
MBNR: పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఎన్నికల విధులలో పాల్గొనే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ రామంజుల రెడ్డి కోరారు. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ఆదివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు.
News February 7, 2026
MBNR: సౌత్ జోన్.. ఈనెల 10న చెస్ ఎంపికలు

సౌత్ జోన్ & ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెస్ (స్త్రీ) ఎంపికలను నిర్వహిస్తున్నట్లు పాలమూరు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు Way2Newsతో తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఉన్న సంబంధిత కళాశాలల విద్యార్థులు బోనాఫైడ్ పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరు కావాలన్నారు. 17-25 వయసు ఉండాలన్నారు. ముఖ్య అతిథిగా వీసీ జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు హాజరుకానున్నారు.


