News March 2, 2025

దేవరకొండ: భార్యభర్తల మధ్య గొడవ.. ఒకరు మృతి

image

భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భార్య మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ముదిగొండలో జరిగింది. సీఐ నరసింహులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్తెం లక్ష్మయ్య వెంకటమ్మ దంపతులు మద్యం తాగుతూ అప్పుడప్పుడు గొడవ పడుతుండేవారని, శుక్రవారం రాత్రి జాతర సందర్భంగా మద్యం సేవించి గొడవపడడంతో ఆ గొడవలో భర్త లక్ష్మయ్య భార్యను నెట్టేయడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News March 4, 2025

నల్గొండ: శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. పీఆర్టియూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డితో పోటీపడి 13,969 ఓట్లు సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఆసాంతం ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. చివరకు మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్‌తోనే శ్రీపాల్ రెడ్డి గెలుపు ఖరారైంది.

News March 4, 2025

నల్గొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా కన్వర్జెన్ మీటింగ్

image

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు తీసుకోవాల్సిన తక్షణ సహాయక చర్యలపై లీగల్, మెడికల్, ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ సంబంధిత అధికారులతో జిల్లా SP శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో భరోసా కన్వర్జెన్ మీటింగ్‌ను సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్ జడ్జి కులకర్ణి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ దీప్తి పాల్గొన్నారు.

News March 4, 2025

నల్గొండ: ‘భరోసా ద్వారా బాధిత మహిళలకు అండగా నిలవాలి’

image

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు తీసుకోవాల్సిన తక్షణ సహాయక చర్యలపై లీగల్, మెడికల్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సంబంధిత అధికారులతో భరోసా కన్వర్జేన్ సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!