News August 13, 2024
దేవరకొండ: షాపింగ్‌కి వెళ్లి వచ్చేసరికి దొంగతనం

దేవరకొండ పట్టణం గాంధీ నగర్‌కి చెందిన RTC ఉద్యోగి నేనావత్ చందు సువర్ణ ఇంట్లో దొంగతనం జరిగింది. మూడు గంటల సమయంలో తాను షాపింగ్‌కి వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 6 తులాల బంగారు గొలుసు, 60 తులాల వెండి, 19 వేల నగదు అపహరించారని సువర్ణ పోలీసులకి ఫిర్యాదు చేశారు. గంటన్నరలోనే చోరీ చేశారని ఆమె విలపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI తెలిపారు
Similar News
News November 27, 2025
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఉన్నతాధికారులు

నల్గొండ: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు ఐఏఎస్ అధికారిణి కొర్ర లక్ష్మీ గురువారం పలు కేంద్రాలను సందర్శించారు. నార్కట్‌పల్లి గ్రామ పంచాయతీ, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఆమెతో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ, ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News November 27, 2025
NLG: ఇక్కడ మహిళలే కీలకం

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పురుషులతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లు 28 వేల పైచిలుకు అధికంగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అలాగే గంపగుత్త ఓట్ల కోసం కులసంఘాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.
News November 27, 2025
NLG: రైతు పత్తికే వంక!… రైతన్నల అవస్థలు

దళారుల చేతుల్లో పత్తి మిల్లులు ఉండటంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొండమల్లెపల్లి, కట్టంగూరు, చండూరు మండలాల పరిధిలోని జిన్నింగ్ మిల్లులలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మిల్లుకు తెచ్చిన పత్తిని ఎలాంటి వంకలు పెట్టకుండా కొనుగోలు చేస్తున్నారని, రైతులు తెచ్చిన పత్తికి నానా వంకలు పెడుతున్నారని తెలిపారు.


