News July 4, 2024

దేవరకొండ: స్నేహితుడి పాడే మోసిన ఎమ్మెల్యే బాలు నాయక్

image

దేవరకొండ మండలంలోని ఇద్దంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ పిల్లి వెంకటయ్య యాదవ్ మరణం బాధాకరమని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. ఆయన స్వగృహంలో భౌతికకాయన్ని సందర్శించి, కంటతడి పెట్టుకున్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే స్నేహితుడి వెంకటయ్య అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి నివాళులర్పించారు.

Similar News

News October 28, 2025

NLG: శిశు విక్రయ ఘటనపై సీరియస్… కేసు నమోదు

image

నల్గొండ జిల్లాలో శిశు విక్రయం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. శిశువును అమ్మిన తల్లిదండ్రులు బాబు, పార్వతితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు, మధ్య దళారులుగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేయాలని నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

News October 28, 2025

NLG: గొలుసు చోరీ.. వీరిని గుర్తిస్తే పారితోషకం

image

త్రిపురారం మండలం నీలయ్యగూడెంలో మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును తెంపుకొని వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. వారిని గుర్తించిన వారు త్రిపురారం పోలీస్ స్టేషన్‌లో సమాచారమివ్వాలని సూచించారు. త్రిపురారం పోలీస్ స్టేషన్ నంబర్ 87126 70196కి కాల్ చేసి చెప్పొచ్చని హాలియా సీఐ సతీష్ రెడ్డి కోరారు. వారికి తగిన పారితోషకం ఇస్తామని తెలిపారు.

News October 28, 2025

NLG: 21 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు 21 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. 1951 నుంచి 2004 వరకూ 8 సార్లు SIR నిర్వహించారు. చివరి సారిగా 21 ఏళ్ల క్రితం 2002-2004 మధ్య చేపట్టారు. జిల్లాలో బీఎల్వోలు త్వరలోనే మ్యాచింగ్ కాని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓట్లు ఎలా పొందారో.. దానికి కావాల్సిన పత్రాలను ఓటర్ల నుంచి స్వీకరించనున్నారు.