News October 13, 2024
దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత.. 70 మందికిపైగా గాయాలు?
కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది. కర్రల సమరంలో హింస చెలరేగింది. దేవతామూర్తులు మాళమ్మ, మల్లేశ్వరస్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్లాడారు. దీంతో సుమారు 70 మందికిపైగా గాయాలైనట్లు తెలుస్తోంది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 9, 2024
కూలిన బ్రిడ్జి.. నిలిచిపోయిన రాకపోకలు
తుగ్గలి మండలం గిరిగేట్ల గ్రామంలోని నూతన సచివాలయం వద్ద ఉండే బ్రిడ్జి శుక్రవారం రాత్రి కూలిపోయిందని స్థానికులు తెలిపారు. దీంతో చెన్నంపల్లి, పగిడిరాయి, కొత్తూరు, తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి యథావిధిగా రాకపోకలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News November 9, 2024
విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డీఈవో
ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో శనివారం సెలవు ప్రకటించామని, జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు స్పెషల్ క్లాసుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలని సంబంధిత డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలను ఆదేశించారు. విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పన్నారు.
News November 9, 2024
నంద్యాల డీఎస్పీగా పీ.శ్రీనివాస రెడ్డి
నంద్యాల సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా పీ.శ్రీనివాస రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది డీఎస్పీలు బదిలీ కాగా, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆయనను నంద్యాల డీఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డీజీపీ సీహెచ్ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.