News October 23, 2024

దేవరపల్లి: ఆటో డ్రైవర్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ

image

దేవరపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కోటేశ్వరరావు రాజమండ్రిలో ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్ కేసులో కీలక పాత్ర పోషించాడు. పోలీసులకు సమాచారం అందించి బాలికలను క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పజెప్పడంలో సహాయపడ్డాడు. దీంతో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆటో డ్రైవర్‌ను మంగళవారం ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు ఈ ఆటో డ్రైవర్‌ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 6, 2025

మాక్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం చేపట్టిన “కౌశలం” సర్వేలో భాగంగా ఈనెల 6న నిర్వహించే మాక్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని సచివాలయాల్లో వెబ్ క్యామ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వే ద్వారా 1,09,347 మందిని గుర్తించి, 535 సెంటర్లలో ఈ మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తామని బుధవారం ఆమె మీడియాకు వెల్లడించారు.

News November 5, 2025

‘గర్భగుడి వద్ద చెప్పులు’ ఘటనపై విచారణ చేస్తున్నాం: ఈఓ

image

పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం సాయంత్రం గర్భగుడి వద్దకు చెప్పులు తీసుకెళ్లిన ఘటనపై ఈఓ శ్రీనివాసరావు స్పందించారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువ ఉందని ఆ హడావిడిలో ఒక అజ్ఞాత వ్యక్తి గర్భగుడి గుమ్మం బయట చెప్పులను వదిలి వెళ్లాడని, వెంటనే సిబ్బంది ఆ చెప్పులను తొలగించారన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, బాద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.