News August 23, 2025

దేవరపల్లి: లారీ ఢీకొని సర్పంచ్ బుల్లారావు మృతి

image

దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సదర మండలం రామన్నపాలెం సర్పంచ్ కూచిపూడి బుల్లారావు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బుల్లారావు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News August 29, 2025

తాళ్లపూడి: ఉరేసుకుని యువకుడి మృతి

image

తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టకి చెందిన సాయి (26) గ్రామ శివారులో వేపచెట్టుకు శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి 6సం.లు క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎడాది క్రితం భార్యమృతి చెందడంతో మానసికంగా కృంగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తాళ్లపూడి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.

News August 29, 2025

తూ.గో జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

image

తూర్పు గోదావరి జిల్లాలో గత 24 గంటల్లో సగటున 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు గణాంక శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. రాజమండ్రి అర్బన్ పరిధిలో అత్యధికంగా 36.4 మిల్లీమీటర్లు, రంగంపేట మండలంలో అత్యల్పంగా 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వెల్లడించారు. కాగా జిల్లాలో మొత్తం 197.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని పేర్కొన్నారు.

News August 29, 2025

ర్యాగింగ్ జోలికి వెళితే చర్యలు తప్పవు: ఎస్పీ

image

రాజమండ్రి: విద్యార్థులు ఆనందంగా జీవితాన్ని గడపాలని, ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ డి.నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఇస్త్రీ పెట్టెతో విద్యార్ధిని కాల్చిన ఘటనపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతరులను ఇబ్బందికి గురిచేయాలని, బాధపెట్టాలని వచ్చే మానసిక రుగ్మతే ర్యాంగింగ్ అని అన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లకు ఆదర్శప్రాయులుగా ఉండాలన్నారు.