News February 9, 2025

దేవరపల్లి హైవేపై ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

image

దేవరపల్లి మండలం గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం సంగాయిగూడెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు ముగ్గురు పిల్లలతో కలిసి కొవ్వూరు వైపు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రమాదానికి గురయ్యారు. భార్య, భర్త, కుమారుడిని గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మిగిలిన ఇద్దరు కుమార్తెలను మరో ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 12, 2025

రాజమండ్రి: 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’

image

స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’ కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 27,441 మందికి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అలాగే అసంపూర్తి ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం కింద ఎస్సీ, బిసీలకు రూ.50,000/- & ఎస్టీలకు రూ.75,000 అందజేయనున్నట్లు వెల్లడించారు.

News March 12, 2025

రాజమండ్రి: ఆ రైళ్లు సికింద్రాబాద్ వెళ్లవు..!

image

సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు ముమ్మరం కావడంతో స్టేషన్‌కు వచ్చే 14 ముఖ్యమైన రైళ్ల రూటును మార్చేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. లింగంపల్లి- కాకినాడ స్పెషల్ (07445/07446) ఏప్రిల్ 2 నుంచి, లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805/12806) ఏప్రిల్ 25 నుంచి సికింద్రబాద్‌కు రాకుండానే చల్లపల్లి మీదుగా నడుస్తాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.

News March 12, 2025

తూ.గో. జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా ప్రవీణ్ కుమార్‌ను తూ.గో.జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం కేటాయించింది. జోనల్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ జైన్‌ను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

error: Content is protected !!