News September 27, 2024
‘దేవర’ అభిమానుల సందడి.. కటౌట్‌కి పాలాభిషేకం
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని మానేపల్లిలో ‘దేవర’ అభిమానుల సందడి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్స్‌కు ఆయన ఫ్యాన్స్ గజమాలలు వేసి, పాలాభిషేకం చేశారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో ప్రారంభం కానుండగా.. అన్ని థియేటర్లలో రేపు రిలీజ్ కానుంది. అనంతరం టపాసులు పేల్చుతూ ‘జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ మూవీలోని పాటలకు డాన్సులు వేశారు.
Similar News
News October 16, 2024
పోలీస్ యంత్రాంగాన్ని సిద్ధం చేసిన ప్రకాశం ఎస్పీ
రానున్న 48 గంటలలో భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఎస్పీ AR దామోదర్ తెలిపారు. ప్రత్యేక బలగాలతో బందోబస్తు, కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బందితో 18 టీంలు ఏర్పాటు చేశామని.. ప్రతి టీంలో 20 మంది ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారన్నారు.
News October 15, 2024
అందరూ సెలవు ఇవ్వాల్సిందే: ప్రకాశం కలెక్టర్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పందించారు. ముందస్తు జాగ్రత్తగా బుధవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అందరూ సెలవు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రేపు జిల్లాలో 200 మిల్లీ మీటర్ష అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని.. అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
News October 15, 2024
15 పునరావాస కేంద్రాల ఏర్పాటు: ప్రకాశం కలెక్టర్
ప్రకాశం జిల్లాలో 5 కోస్టల్ మండలాలు ఉన్నాయని.. వీటి పరిధిలో పూరి గుడిసెలను గుర్తించి 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఇప్పటికే 5 పునరావాస కేంద్రాలను ఓపెన్ చేసి సోమవారం నుంచి ఆ ప్రాంత ప్రజలకు భోజనం అందజేశామని చెప్పారు. ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పడపాడు, టంగుటూరు, జరుగుమల్లి, కొండేపి మండలాల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు.