News December 18, 2024
‘దేవర’ పొట్టేలు.. రూ.1.28 లక్షలు పలికింది!

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ‘దేవర’ పొట్టేలు రికార్డు ధర పలికింది. వందగల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దేవర పేరు పెట్టి పెంచారు. విక్రయించేందుకు సంతకు తీసుకెళ్లగా రైతులు పోటీ పడ్డారు. ₹20వేలతో మొదలు కాగా చివరికి ₹1.28లక్షలకు పెద్దకడబూరు మండలంలోని బాపులదొడ్డికి చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. తమ గ్రామంలో ఈ నెల 25, 26 తేదీలలో జాతర ఉండటంతో ఈ పొట్టేలును కొనుగోలు చేసినట్లు అతడు తెలిపారు.
Similar News
News July 6, 2025
డిజిటల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సప్, స్కైప్ల ద్వారా వీడియో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సైబర్ నేరం జరిగితే https://cybercrime.gov.in/కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News July 5, 2025
పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయం: మంత్రి

పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి స్వర్ణాంధ్ర-పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్) తొలి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, కుటుంబాల అర్హతలు పక్కాగా పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేయలని ఆదేశించారు.
News July 5, 2025
ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం: కలెక్టర్

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో ఈనెల 10న మెగా పీటీఎం 2.0 కార్యక్రమం
నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా శనివారం ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసమే పీటీఎం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.