News April 2, 2025

దేవాదాయ శాఖ కమిషనర్‌ను కలిసిన జిల్లా కలెక్టర్

image

భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం జిల్లాకు వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలిసి స్వాగతం పలికారు. కళ్యాణం పట్టాభిషేకం మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్‌ను దేవదాయ శాఖ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.

Similar News

News April 10, 2025

తాడేపల్లి: ఇప్పటంలో విషాదం.. ఇద్దరి చిన్నారుల దుర్మరణం 

image

తాడేపల్లి (M) ఇప్పటంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం (D) అద్దంకి నుంచి పనికోసం ఓ కుటుంబం ఇక్కడికి వచ్చింది. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ గోతిలో పడి చనిపోయారు. విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచి బాధిత కుటుంబం, చిన్నారుల మృతదేహాలను అద్దంకికి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు విచారణ చేపట్టారు.

News April 10, 2025

నేడు నంద్యాల జిల్లాకు వర్ష సూచన

image

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నేడు నంద్యాల జిల్లాలో వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు నిన్న నంద్యాల జిల్లా దొర్నిపాడులో అత్యధికంగా 39.7°C ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.

News April 10, 2025

సంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్.. నేడు భారీ వర్షం

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మెదక్‌లో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడనుండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

error: Content is protected !!