News March 14, 2026
దేవాన్ష్ ధోతీ ఫంక్షన్‌లో నారా, నందమూరి ఫ్యామిలీ

AP: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక ఇవాళ HYDలో జరిగింది. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి ఫ్యామిలీ సందడి చేసింది. అమ్మమ్మ వారి తరఫున నందమూరి బాలకృష్ణ దంపతులు దేవాన్ష్‌తో పాటు లోకేశ్, బ్రాహ్మణికి నూతన వస్త్రాలు పెట్టారు. అనంతరం అందరూ కలిసి ఫొటోలు దిగారు. వీటిని లోకేశ్ Xలో షేర్ చేశారు. దేవాన్ష్ ఎదుగుదల చూసి తామందరికీ ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Similar News
News April 13, 2026
డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం అవసరం: సీఎం రేవంత్

TG: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై PM మోదీకి CM రేవంత్ ట్వీట్ చేశారు. ఈ రెండూ వేర్వేరు అంశాలన్నారు. ‘రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లకు మహిళల కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తాం. జనాభా ఆధారిత డీలిమిటేషన్ జరగకుండా మహిళా రిజర్వేషన్ కోటాను వాడుకోవడం సరికాదు. ఇది BJPకి తాత్కాలికంగా లాభం చేకూర్చినా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్‌పై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం అవసరం’ అని పేర్కొన్నారు.
News April 13, 2026
అసమగ్ర డేటాతో డీలిమిటేషన్ వద్దు: సోనియా

లోక్‌సభ, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో మహిళకు 33 శాతం సీట్లు కేటాయించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. 2027 జనగణనకు ముందే అసమగ్ర డేటా ఆధారంగా డీలిమిటేషన్‌ను చేయడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. ‘నారీ శక్తి వందన అధినియమ్’ సవరణ బిల్లును ఏప్రిల్ 16-18 మధ్య కాకుండా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాలని డిమాండ్ చేశారు.
News April 13, 2026
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో అవినీతి అంటూ BRS చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఆ పార్టీ SMలో చేస్తున్న దుష్ప్రచారానికి KCRదే బాధ్యతని సీతక్క పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. 48 గంటల్లో ఆ పోస్టులను తొలగించి KCR క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.


