News February 6, 2025
దేవాపూర్ సిమెంట్ కంపెనీ డ్రైవర్ మృతిపై కేసు
దేవాపూర్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్ రవీందర్ సింగ్(36)మృతిపై కేసు నమోదు చేసినట్లు SI ఆంజనేయులు తెలిపారు. రవీందర్కు మంగళవారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో తోటి ఉద్యోగులు అతడిని కంపెనీ డిస్పెన్సరీకి, అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అతడి భార్య మహిమ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
Similar News
News February 6, 2025
WGL: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
బ్యాంకింగ్ రిక్రూట్మెంట్, ఆర్.ఆర్.బీ, ఎస్.ఎస్.సి. ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుకు ఈ నెల 9 వరకు అవకాశం ఉందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. అర్హత గల అభ్యర్థులు https://tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి ఈ నెల 15 నుంచి శిక్షణ ఉంటుందన్నారు.
News February 6, 2025
HYD: ఒకే రోజు 10 మంది మృతి!
HYDలో విషాద ఘటనలు వెలుగుచూశాయి. నిన్న ఒక్కరోజే 10 మంది చనిపోయారు. LBనగర్లో గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. గచ్చిబౌలిలో రిటోజ, SRనగర్లో అమర్జిత్, రాయదుర్గంలో ధర్మప్రధాన్, షాద్నగర్లో నీరజ్, చెరువులో దూకి పీర్జాదిగూడ వాసి బాలరాజు, మీర్పేటలో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు కారణాలతో ఆరుగురు సూసైడ్ చేసుకోగా.. శంకర్పల్లిలో బస్ ఢీ కొని బీటెక్ విద్యార్థి మృతి చెందడం బాధాకరం.
News February 6, 2025
సిరిసిల్ల: రైతులకు కిసాన్ APK లింక్.. రూ.లక్షన్నర మాయం
కిసాన్ ఏపీకే పేరిట వచ్చిన లింక్ ఓపెన్ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బులు మాయమయ్యాయి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల జమ వివరాలు తెలుసుకోవాలంటే ఈ యాప్ను ఇన్స్టాల్ చేయాలని కోనరావుపేటకు చెందిన ఇద్దరు, మంగళ్లపల్లికి చెందిన ఒక రైతు వాట్సాప్కు లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే ముగ్గురి ఖాతాల్లో నుంచి రూ.32 వేలు, రూ.57 వేలు, రూ.70 వేల చొప్పున కట్ అయ్యాయి. PSలో ఫిర్యాదు చేశారు.