News February 6, 2025
దేవాపూర్ సిమెంట్ కంపెనీ డ్రైవర్ మృతిపై కేసు

దేవాపూర్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్ రవీందర్ సింగ్(36)మృతిపై కేసు నమోదు చేసినట్లు SI ఆంజనేయులు తెలిపారు. రవీందర్‌కు మంగళవారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో తోటి ఉద్యోగులు అతడిని కంపెనీ డిస్పెన్సరీకి, అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అతడి భార్య మహిమ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
Similar News
News February 12, 2026
రహేజాకు భూములపై మండలిలో వాడీవేడి చర్చ

AP: కంపెనీలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడీవేడి చర్చ సాగింది. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన రహేజాకు 99 పైసలకే భూములు ఎలా ఇస్తారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స, YCP MLC మాధవరావు ప్రశ్నించారు. విశాఖలోని భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. రహేజా బిల్డింగ్స్‌లో అనేక కంపెనీలు వస్తున్నాయని, వేలాది ఉద్యోగాల కల్పన జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు.
News February 12, 2026
వేములవాడలో తుదిదశకు జాతర ఏర్పాట్లు

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. సుమారు రూ. 1.96 కోట్లతో ఆలయాలకు రంగులు, విద్యుత్ దీపాల అలంకరణ, చలువ పందిళ్లు వంటి పనులు పూర్తి చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్ల క్రమబద్ధీకరణ, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పట్టణంలో స్వాగత ద్వారాలతో పాటు, పార్కింగ్ స్థలాల సూచిక బోర్డులను అమర్చారు.
News February 12, 2026
ఢిల్లీ బాంబు పేలుడుకు జైషేతో లింకులు: UN

ఢిల్లీ <<18265346>>బాంబు బ్లాస్ట్<<>>కు పాక్‌కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్(JeM)తో సంబంధం ఉందని UN ఉగ్రవాద నిరోధక పర్యవేక్షణ బృందం పేర్కొంది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఈ సంస్థ ప్రత్యేకంగా మహిళా వింగ్‌ను ఏర్పాటు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. JeMతో ప్రమాదమని పలు దేశాలు చెబుతుంటే ఓ సభ్య దేశం మాత్రం ఆ సంస్థ పని చేయడంలేదని అంటోందని విమర్శించింది. UNSCకి సమర్పించిన నివేదికలో <<16299135>>పహల్గామ్<<>> దాడినీ ప్రస్తావించింది.


