News October 9, 2024
దేవాలయ ధర్మకర్తల మండలికి దరఖాస్తులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 17 దేవాలయాలకు నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ సహాయ కమిషనర్ అనపర్తి సులోచన ఒక ప్రకటనలో తెలిపారు. కట్టంగూర్, చిట్యాల, నకిరేకల్, కేతేపల్లి, నార్కట్ పల్లి మండలాలలోని ఆలయాల్లో ధర్మకర్తల మండలికి 20 రోజుల్లోగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆమె సూచించారు.
Similar News
News November 2, 2024
నల్లగొండ: అంగన్వాడీ పోస్టులపై ఆశలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ల, హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ మహిళల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 162 టీచర్ల, 595 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయుటకు ఖాళీగా ఉన్న అంగన్వాడి కేంద్రాలున్న గ్రామాల్లో స్థానిక మహిళలకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు.
News November 2, 2024
సాగర్ అభివృద్ధికి చర్యలు : మంత్రి జూపల్లి
నాగార్జునసాగర్, బుద్ధవనం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణంతో పాటు, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం అయన బుద్ధవనం పరిసర ప్రాంతాలను శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కమలేష్ డి.పాటిల్ తో కలిసి పరిశీలించారు. సాగర్ ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
News November 1, 2024
కోదాడ: నీ డీపీ బాగుంది.. ఉద్యోగినికి లైంగిక వేధింపులు
కోదాడలో ఉద్యోగినిపై లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగుచూసింది. బాధిత మహిళ వివరాలిలా.. ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేసి తాను ఓ రాజకీయ నాయకుడి పీఏ అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘డీపీ బాగుంది.. వస్తావా’ అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బు ఎంతైనా ఇస్తా లొంగి పోవాలంటూ ఇబ్బంది పెట్టాడంటూ బాధితురాలు వాపోయింది. నిందితుడిపై షీ టీం, సూర్యాపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పింది.