News April 6, 2025
దేవీపట్నం: ‘మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యనే హత్య చేశాడు’

దేవీపట్నం(M) పాముగండికి చెందిన కె.గంగన్నదొర మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని అతని భార్య పాపయమ్మ (28) హత్య చేసాడని ఎస్సై షరీఫ్ ఆదివారం తెలిపారు. తాగుడుకు అలవాటు పడిన గంగన్న దొర నిత్యం డబ్బులు కోసం ఆమెను వేధించేవాడని పేర్కొన్నారు. అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని ఆమెను కర్రతో తీవ్రంగా కొట్టి, గొంతు నొక్కి చంపాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News December 2, 2025
సిద్దిపేట: ఈ మండలాల్లో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడత నామినేషన్లు రేపటి నుంచి స్వీకరించనున్నారు. జిల్లాలో 9 మండలాలు అక్కన్నపేట, చేర్యాల, దూల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరులో మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా మొదటి, రెండవ విడత నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమై మొదటి విడత నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. రెండో విడత నామినేషన్లు 3న ముగియనున్నాయి.
News December 2, 2025
ఏకాంత సేవలో ఆంతర్యం ఏంటంటే?

శ్రీవారి ఆరాధనలో రోజూ రాత్రి జరిగే చివరి సేవను ఏకాంత సేవ (లేదా) పవళింపు సేవ అంటారు. ఈ సేవలో వెండి మంచం, పట్టు పరుపుపై భోగ శ్రీనివాస మూర్తిని వేంచేపు చేస్తారు. స్వామిని నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ సమయంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించి, తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి సమర్పిస్తారు. ధనుర్మాసంలో భోగ శ్రీనివాసునికి బదులుగా, కృష్ణ భగవానునికి ఈ ప్రత్యేక ఏకాంత సేవను నిర్వహించడం ఆనవాయితీ. <<-se>>#VINAROBHAGYAMU<<>>