News April 5, 2025
దేశంలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం: మంత్రి ఉత్తమ్

ఆహార భద్రత విషయంలో దేశంలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో సన్న బియ్యం లబ్ధిదారులు పాలడుగు వెంకటయ్య నివాసాన్ని సందర్శించి వారితో కలిసి భోజనం చేసి మాట్లాడారు. సన్నబియ్యం పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలందరికీ మేలు జరుగుతుందని, గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.
Similar News
News December 1, 2025
గెలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు

మెదక్ జిల్లాలో నవంబర్ 28 నుంచి ఆదివారం వరకు జరిగిన 44వ తెలంగాణ రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్ బాలబాలికల పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు ప్రతిభ కనబర్చాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర, బాలికల జట్లు మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఖోఖో సంఘం సభ్యులు, క్రీడాభిమానులు అభినందించారు.
News December 1, 2025
పలాస: యాక్సిడెంట్.. యువకుడుకి తీవ్ర గాయాలు

పలాస మండలం సున్నాడ గ్రామ జంక్షన్ సమీప రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
News December 1, 2025
సిద్దిపేట: సర్పంచ్ స్థానాలకు 747 నామినేషన్లు వ్యాలిడ్

సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో ఏడు మండలాల్లోని 163 గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. మొత్తం 953 నామినేషన్లు దాఖలు కాగా, అందులో 747 నామినేషన్లు వ్యాలిడ్గా తేల్చారు. వార్డు స్థానాలకు 3504 నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల పరిశీలన అనంతరం 3429 నామినేషన్లు వ్యాలీడ్గా అధికారులు ప్రకటించారు.


