News July 30, 2024
దేశంలోనే 4వ స్థానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్

శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్యా పరంగా దేశంలోనే 4వ స్థానంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ త్వరలోనే ఆస్థానాన్ని మరింత మెరుగుపరచుకోనుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయితే 10.9% పెరుగుదలతో శరవేగంగా బిజీగా మారుతున్న ఎయిర్ పోర్టులలో నగరం ఒకటిగా నిలుస్తోంది.
Similar News
News November 19, 2025
17వ వార్షికోత్సవంలోకి ట్రూ జోన్ సోలార్

తెలంగాణకు చెందిన పాన్-ఇండియా సోలార్ కంపెనీ అయిన ట్రూజోన్ సోలార్ (సుంటెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్) బుధవారంతో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో 17వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. కొన్ని సంవత్సరాలుగా ట్రూజోన్ దేశంలోని అత్యంత విశ్వసనీయ సోలార్ బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించింది. కస్టమర్-ఫస్ట్ విధానంతో ట్రూజోన్ సోలార్ భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడానికి కట్టుబడి ఉంది.
News November 19, 2025
HYD: ప్రజాభవన్‌లో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్

HYD బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఈరోజు నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను రూపుమాపేలా నిపుణులు, మేధావులు, అధికారుల సలహాలు తీసుకుంటామని చెప్పారు.
News November 19, 2025
HYD: ‘చెరి సగం ఖర్చు భరించి మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం’

HYD నగరంలో నిర్మించనున్న 160 KM మెట్రో రైల్ లైన్‌ను చెరి సగం ఖర్చుతో పూర్తి చేస్తామని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. ఎల్ అండ్ టీ ఆధీనంలోని మెట్రోను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత జరిగే మెట్రో నిర్మాణంలో రాష్ట్రంతో కేంద్రం పార్టనర్‌షిప్ కుదుర్చుకుంటుందన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు కేంద్రం తన నిర్ణయం చెబుతుందని నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు.


