News August 12, 2024
దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీపడాలి: చంద్రబాబు

పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News December 5, 2025
పైడమ్మ జాతర రెండో రోజు.. సిద్ధమవుతున్న శిడిబండ్లు.!

పెడనలో పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు శుక్రవారం శిడిబండ్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతర రెండో రోజు కాపుల వీధి నుంచి విశేషంగా మొత్తం 11 శిడిబండ్లు అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధికి బయలుదేరనున్నాయి.
News December 5, 2025
ఉయ్యూరు కేసీపీలో క్రషింగ్ షురూ

ఉయ్యూరులోని కేసీపీ చక్కెర కర్మాగారంలో 2025-26 సీజన్కు సంబంధించిన చెరకు క్రషింగ్ను గురువారం రాత్రి యూనిట్ హెడ్ యలమంచిలి సీతారామదాసు ప్రారంభించారు. ఈ సీజన్లో 3.20 లక్షల టన్నుల చెరకు గానుగ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులు మరింత విస్తీర్ణంలో చెరకు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సీజన్లో చెరకు టన్ను ధర రూ.3,690గా యాజమాన్యం నిర్ణయించింది.