News March 4, 2025
దేశం కోసం ప్రకాశం జిల్లా వాసి ప్రయత్నం!

ఒక నినాదం కోసం వేల మైళ్లు సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకాశం జిల్లా వాసి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంటూ రుద్రవారం వాసి సుభాశ్ చంద్రబోస్ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఏకంగా 50 వేల కి.మీ యాత్రలో భాగంగా 28 రాష్ట్రాలను చుట్టేశాడు. 41,223 కి.మీ సైకిల్ తొక్కి విశాఖ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చొరవతో రాష్ట్రపతికి ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అందజేయడం తన లక్ష్యమంటున్నాడీ కుర్రాడు.
Similar News
News April 23, 2025
చంద్రబాబే లిక్కర్ స్కాం చేశారు: తాటిపర్తి

లిక్కర్ స్కాంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసలు లిక్కర్ స్కాం ఎవరు చేశారు? 2014-19 మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబే స్కాం చేశారని రాష్ట్రప్రభుత్వానికి చెందిన సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మరి ఇప్పుడు ఈ కేసు ఏమైంది? ఎందుకు నడవడం లేదు? ’ అని ఎమ్మెల్యే తాటిపర్తి ట్వీట్ చేశారు.
News April 23, 2025
ఒంగోలులో TDP నేత హత్య.. లోకేశ్ దిగ్ర్భాంతి

ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వార్త తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య టీడీపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
News April 23, 2025
పోలీస్ ఉద్యోగం గొప్ప అవకాశం: ప్రకాశం ఎస్పీ

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసుశాఖ ప్రతిష్ఠ మరింత పెంచాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు ఆయన మంగళవారం నియామకపత్రాలు అందజేశారు. పోలీస్ శాఖలో చేరడం గొప్ప అవకాశమన్నారు. ప్రజల భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం ముఖ్య కర్తవ్యమని సూచించారు.