News May 25, 2024
దేశం సుభిక్షంగా ఉందంటే మోడీదీ వల్లే: ఈటల

దేశం సుభిక్షంగా ఉందంటే ప్రధాని మోదీ వల్లేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించిన ఈటల మాట్లాడుతూ.. ఒకప్పుడు దేశం బాంబు పేలుళ్లతో వణికిపోయిందని, నేడు మోదీ నాయకత్వంలో దేశంలో ప్రజలు సుభిక్షంగా ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
Similar News
News April 10, 2026
కరీంనగర్ కార్పొరేషన్‌లో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్

కరీంనగర్ నగర పాలక సంస్థలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన ముగ్గురు సభ్యులు (ఒక మహిళ, ఇద్దరు పురుషులు) మైనారిటీ వర్గాలకు చెందిన ఇద్దరు సభ్యులను ఎంపిక చేయనున్నారు. కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలతో ఏప్రిల్ 16, 2026 సాయంత్రం 5 గంటలలోపు కమిషనర్‌కు దరఖాస్తు సమర్పించాలి.
News April 10, 2026
KNR: పాడిపశువుల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అమలు చేస్తున్న ‘2 పాడి పశువుల పథకం’ దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నెల16 వరకు OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసి, ఆధార్, రేషన్, కులం, ఆదాయం, బ్యాంక్ పాస్‌బుక్, భూమి పట్టా పత్రాలతో MPDO/ మునిసిపల్ కార్యాలయంలో సమర్పించాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
News April 9, 2026
హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ రద్దు కోసం కలెక్టర్‌కి వినతి

హుజూరాబాద్ సమీపంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. డంపింగ్ యార్డ్ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం, రైతుల పంటలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును నిలిపివేయాలని వినతిపత్రం అందజేశారు.


