News December 24, 2024
దేశానికి వాజపేయి సేవలు వెలకట్టలేనివి: ఎంపీ రఘునందన్

తాజ్ దక్కన్లో ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ సుధాన్షు తివారీతో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. ప్రధానిగా వాజపేయి దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని అంటు ఆయన సేవలను కొనియాడారు.
Similar News
News October 20, 2025
మెదక్: అగ్నిమాపక కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

మెదక్ జిల్లా రామాయంపేటలోని అగ్నిమాపక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. అగ్నిమాపక సేవలపై హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కేంద్రంలోని పరికరాల పనితీరు, వాహనాల వినియోగం, హాజరు పట్టికను ఆయన పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సిబ్బంది వెంటనే స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 19, 2025
మెదక్: పాతూరు సబ్స్టేషన్ను సందర్శించిన కలెక్టర్

మెదక్ మండలం పాతూరు సబ్స్టేషన్ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యుత్ సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగేలా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News October 19, 2025
మెదక్: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా సుశాంత్ గౌడ్ ఎంపిక

గ్రూప్-2 పరీక్షల్లో మెదక్ పట్టణానికి చెందిన మంగ నారా గౌడ్, ఇందిర దంపతుల తనయుడు సుశాంత్ గౌడ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్-2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సుశాంత్ గౌడ్ ముఖ్యమంత్రి చేతుల మీదగా ఉత్తర్వులు అందుకున్నారు.