News April 11, 2025
దేశాయిపల్లిలో మూడు కాళ్లకోడి

తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లిలో మూడు కాళ్ళ కోడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దేశాయిపల్లిలో రాజిరెడ్డి ఓ పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నాడు. గురువారం కోళ్లకు దాణ వేసే క్రమంలో మూడు కాళ్ల కోడిని గుర్తించినట్టు రాజిరెడ్డి తెలిపాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో గ్రామస్థులు మూడు కాళ్ల కోడిని ఆసక్తిగా చూశారు.
Similar News
News January 6, 2026
మదురో లాయర్ ఎవరంటే?

అమెరికా నిర్బంధంలో ఉన్న వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో తరఫున వాషింగ్టన్కు చెందిన ప్రముఖ లాయర్ బ్యారీ పొలాక్ రంగంలోకి దిగారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే తరఫున కొన్నేళ్లపాటు ఈయనే ప్రాతినిధ్యం వహించారు. US గూఢచర్యం చట్టం కింద అరెస్టయిన అసాంజేను జైలు నుంచి విడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈయన 30 ఏళ్లుగా ఎన్నో కార్పొరేట్, హై ప్రొఫైల్ కేసులను వాదిస్తున్నారు.
News January 6, 2026
నిర్మల్ జిల్లాలో అస్థిపంజరం కలకలం

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామ శివారులో సోమవారం ఓ అస్థిపంజరం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ చేనులో నోటి దౌడ ఎముకలతో పాటు బాడీ ఎముకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అస్తిపంజరాల ఎముకలను సేకరించి పోరాన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు.
News January 6, 2026
పాలమూరు: TGలో టాప్-5.. మనోళ్లే..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సైబర్ నేరాలపై అవగాహన, బాధితులకు రిఫండ్ల సాధనలో ఉత్తమ సేవలు అందించిన టాప్-5 సైబర్ వారియర్స్‌లను ఎంపిక చేయగా.. అందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది.
1.ఎం.మధు గౌడ్(MBNR రూరల్ పీఎస్)
2.వికాస్ రెడ్డి(MBNR-వన్ టౌన్ పీఎస్)
3.శ్రీనివాసులు(దేవరకద్ర పీఎస్)


