News July 4, 2024
దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ పవన్ పూజలు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాధికాలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగా గురువారం సూర్యారాధన చేశారు. దీక్షాబద్ధులైన పవన్ ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు.
Similar News
News September 18, 2025
గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.
News September 18, 2025
గుంటూరులో డయేరియా కేసులు

గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన ఆహారం, నీటి వల్ల వాంతులు, విరోచనాలు పెరిగాయని వైద్యులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 35 మంది అతిసార లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారు. అతిసార రోగులకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపారు.
News September 18, 2025
బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో బందోబస్తు సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ప్రముఖులతో మర్యాదగా వ్యవహరిస్తూ, విధి నిర్వహణలో మాత్రం కఠినంగా ఉండాలని సూచించారు. ఏవైనా ఆకస్మిక ఘటనలు జరిగినప్పుడు పక్క సెక్టార్లలోని పోలీసులు సహాయం అందించాలని చెప్పారు.