News March 20, 2025
దొంగగా మారిన బ్యాంకు ఉద్యోగి

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతని నుంచి 2 గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాజులూరులో దొంగతనం కేసులో అతనిని అరెస్టు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించినట్లు తెలిపారు.
Similar News
News March 28, 2025
అమెరికాలో జనసేన ఆత్మీయ సమావేశం

అమెరికాలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ పాల్గొన్నారు. జనసేన పార్టీ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీగా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించిందన్నారు. వివిధ రంగాల్లో ఉన్న మేధావులు పార్టీ కోసం కృషి చేశారని కొనియాడారు. ఎన్డీఏ కూటమి బలోపేతానికి ఎన్ఆర్ఐలు సహకారం అందించాలని కోరారు.
News March 28, 2025
కంచరపాలెంలో దారుణం.. ఒకరు మృతి

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఎస్ఆర్ఆర్ నగర్కు చెందిన పి.హనుమంతురావు(60) మృతదేహం కలకలం రేపింది. చెట్టుకు నగ్నంగా కట్టేసి కొట్టడంతో అతను చనిపోయినట్లు సమాచారం. స్థానికులు చెట్టుకు కట్టేసి ఉన్న అతని మృతదేహాన్ని కిందకు దించి వస్త్రాలు కప్పారు. వారి సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
ఇంట్లో పేకాట.. విశాఖలో 11 మంది అరెస్ట్

హెచ్బి కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న వారిని ఎంవీపీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.22,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిపై కేసు నమోదు చేశారు. నగరంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.