News May 12, 2024
దొంగనోట్లు పంచుతున్నారు: వరద రాజుల రెడ్డి

ప్రొద్దుటూరులో ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఓటుకు నోటుకు తెరెత్తారని కూటమి MLA అభ్యర్థి వరదరాజుల రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. MLA పంపిణీ చేసిన డబ్బులో దొంగనోట్లు ఉన్నాయేమో ప్రజలు గమనించుకోవాలన్నారు. బంగారు కమ్మలు సైతం ఇస్తున్నారని.. అందులో నకిలీ కూడా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మీ భూములను దోచుకునేందుకే ఇంకో అవకాశం ఇవ్వమని వైసీపీ నాయకులు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.
Similar News
News February 13, 2025
YS జగన్ రేపటి కడప పర్యటన షెడ్యూల్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడపకు రానున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి వివాహ వేడుకలకు జగన్ రానున్నారు. రేపు ఉదయం 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గాన నగర శివారులోని మేడా ఫంక్షన్ హాల్‌కు వెళ్తారు. నూతన వధూవరులను ఆశీర్వదించి తిరిగి 11.30 గంటలకు కడప నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లనున్నారు.
News February 13, 2025
కడప: పోలీసే దొంగ అవతారం

కడప జిల్లాలో రికవరీ చేసిన సొమ్మును ఓ కానిస్టేబుల్ కాజేసిన ఘటన కలకలం రేపుతోంది. ఖాజీపేట పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్, సీజ్ చేసిన దొంగ సొమ్మును తీసుకెళ్లడం సీసీ కెమెరాల ద్వారా రికార్డు కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ విచారణ జరిపి సంబంధిత కానిస్టేబుల్‌కు మెమో జారీ చేశారు.
News February 13, 2025
పులివెందుల: గడ్డి మందు తాగి బాలుడు మృతి

పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లెకు చెందిన వెంగముని, దేవిల కుమారుడు మోహిత్(14) మంగళవారం సాయంత్రం గడ్డి మందు తాగాడు. బంధువులు మోహిత్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి రెఫర్ చేశారు. బుధవారం చికిత్స పొందుతూ మోహిత్ మృతి చెందాడని బంధువులు తెలిపారు. కాగా ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే బాలుడు విషం తాగాడని సమాచారం.