News February 7, 2025
దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

ఏలూరులోని నగల దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన<<15384948>> దొంగలను<<>> పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు అంతర్‌రాష్ట్ర ముఠాగా గుర్తించిన పోలీసులు వారు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు తెలిసి అక్కడకు వెళ్లారు. వారి గ్రామాల సమీపంలో మాటు వేసి పట్టుకున్నారు. నిందితులపై ఏలూరు పరిధిలో దాదాపు 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు
Similar News
News December 24, 2025
ప.గో: రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి.. UPDATE

పెనుమంట్ర మండలం పొలమూరులో జరిగిన రోడ్డు ప్రమాదంపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం స్పందించారు. ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన ఘటనపై పోలీసు, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ జరపాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి త్వరగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
News December 24, 2025
ప.గో: అకౌంట్లో నుంచి రూ.90 వేలు కట్.. ఎలాగో తెలిస్తే షాక్!

వాట్సాప్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసిన ఓ వ్యక్తి రూ.90 వేలు పోగొట్టుకున్నారు. ఉమ్మడి ప.గో జిల్లా ఏలూరులోని దక్షిణపు వీధికి చెందిన సత్యనారాయణకు ఈనెల 17న ‘ఎం-పరివాహన్’ పేరుతో మెసేజ్ రాగా, దాన్ని ఓపెన్ చేయగానే ఖాతా నుంచి నగదు మాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏలూరు వన్‌టౌన్ ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News December 24, 2025
ఈనెల 28న జిల్లాకు కేంద్రమంత్రి సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28న మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంకలో పర్యటించనున్నారు. దత్తత గ్రామమైన ఇక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భీమవరంలో జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్షించారు. పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


