News November 25, 2024

దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతి

image

కొండపాక వాస్తవ్యులు దొమ్మాట (ప్రస్తుతం దుబ్బాక) నియోజకవర్గం మాజీఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కేసీఆర్‌కు రాజకీయ సమకాలికులు. ఆయన మృతిపట్ల మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తంచేశారు. 1983-88లో అప్పటి దొమ్మాట ఎమ్మెల్యేగా ఎంతో నిబద్ధతతో ప్రజా సేవలో ఉన్న ఆయన సేవలు నేటితరం వారికి స్ఫూర్తి అని కొనియాడారు.

Similar News

News July 6, 2025

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఖాజాపూర్ వాసి ఎంపిక

image

జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌కి చెందిన విష్ణు శ్రీ చరణ్ ఎంపికైనట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గణేశ్, రవికుమార్, మల్లీశ్వరి తెలిపారు. జులై 12, 14వ తేదీల్లో దెహ్రదూన్‌లో జరిగే జాతీయ రగ్బీ పోటీలలో చరణ్ పాల్గొనున్నట్లు వారు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన చరణ్‌ను గ్రామస్థులు అభినందించారు.

News July 5, 2025

మెదక్: IIITకి 345 మంది ఎంపిక

image

బాసర IIITకి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 345 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా జిల్లాల విద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నుంచి 222 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మెదక్ నుంచి 78, సిద్దిపేట నుంచి 45 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వెల్లడించారు. IIITకి ఎంపికైన విద్యార్థులను ఆయా జిల్లాల విద్యాధికారులు అభినందించారు.

News July 5, 2025

జిల్లాలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: కలెక్టర్

image

మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమాజానికి చీడ పురుగులా మారిన మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.