News January 27, 2025
దోమకొండ: అవార్డు అందుకున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ

దోమకొండ మండల కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రభు కిరణ్ ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అవార్డు అందజేశారు. దోమకొండ క్లస్టర్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖలో అందిస్తున్న వైద్య సేవలకు ఆయనకు అవార్డును ఇచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆయన్ను అభినందించారు.
Similar News
News December 13, 2025
వేములవాడ: మార్కెట్ ఛైర్మన్‌పై దాడి.. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు: SP

వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. నాగాయపల్లికి చెందిన గోపు మధు, గోపు మాలతి, గుంటి శివ, గుంటి నగేష్‌లపై ఈ మేరకు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, గోపు మధును ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. రాజకీయ కక్షతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు.
News December 13, 2025
వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. నిషేధాజ్ఞలు అమలు

గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల సందర్భంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈనెల 14న జరిగే మొదటి విడత పోలింగ్ నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 13, 2025
రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్, అఖిలేశ్

TG: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇవాళ రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. కేఫ్‌లో వారిద్దరూ టిఫిన్ చేశారు. ఈ ఫొటోలను కేటీఆర్ తన X ఖాతాలో షేర్ చేశారు. కాగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేశ్.. తొలుత సీఎం రేవంత్ రెడ్డితో, తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు.


