News September 5, 2024
దోమకొండ: కారు ఢీకొని పాదచారుడు మృతి
కారు ఢీకొని పాదచారుడు మృతి చెందాడు. ఈఘటన దోమకొండ మండలంలో గురువారం జరిగింది. SI ఆంజనేయులు వివరాలిలా.. దోమకొండ వాసి గజం సత్యం (55) కూలీ పని నిమిత్తం అంచనూరు గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో వేగంగా వెళ్తున్న కారు అతనిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ..మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.
Similar News
News September 10, 2024
NZB: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి మండలం రాంపూర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వృద్ధాశ్రమంలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆంజనేయులు తెలిపారు. హోమ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డి నేటర్, ఏఎన్ఎం, వంట మనిషి, వంట సహాయకుడు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 18లోపు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News September 10, 2024
NZB: నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు
నిజామాబాద్ జిల్లా ప్రజలకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ నెల 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజాపాలనలో కార్డులు లేనివారికి ఇస్తారా? కుటుంబీకుల పేర్లు జత చేర్చుతారా? ప్రస్తుతం ఉన్నవారికి కొత్తకార్డులు ఇస్తారా తెలియాల్సి ఉంది. అయితే కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని అధికారులు వెల్లడించారు.
News September 10, 2024
బోధన్: ‘రూ.20వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలి’
గత నెల రోజులకు కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేలు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. బోధన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని, రైతు బందు పెట్టుబడి సాయం అందజేయాలని అన్నారు. కార్యక్రమంలో మేకల మల్లేష్, సాయిబాబా, రాజయ్య, గోపి, తదితరులు పాల్గొన్నారు.