News January 24, 2025
దోమకొండ గడికోటలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గడికోటలోని మహాదేవుడిని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెుక్కులు చెల్లించుకున్నారు.ప్రియాంక చోప్రాకు గడికోట సభ్యులు, కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కాగా ప్రియాంక చోప్రా గతంలో హీరో రాంచరణ్ తేజ్‌తో కలిసి జంజీర్ సినిమాలో నటించింది. ఆ సమయంలో ఈ దేవాలయం ప్రత్యేకతను ప్రియాంకకు వివరించగా..తాజాగా ఆమె ఈ కోటను దర్శించుకున్నారు.
Similar News
News February 26, 2026
సిరిసిల్ల: ‘ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి’

ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా అధిక దిగుబడితో పాటు దీర్ఘకాలంపాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చని, పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ సాగు, ఫెర్టిలైజర్ యాప్, వ్యవసాయ యాంత్రీకీకరణ, రైతుల వివరాల నమోదు, క్రాప్ బుకింగ్ తదితర అంశాలపై కలెక్టరేట్లో గురువారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో కలెక్టర్ గరిమా అగ్రవాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
News February 26, 2026
హార్వర్డ్ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాం: CM రేవంత్

TG: హార్వర్డ్ను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని గ్రూప్-1,2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో CM రేవంత్ వెల్లడించారు. ‘ఇక్కడి నుంచి హార్వర్డ్‌కు వెళ్లేందుకు చాలామందికి కష్టమవుతోంది. అందుకే MCHRD-హార్వర్డ్ మధ్య ఓ ఒప్పందం చేసుకుంటున్నాం. వాళ్లే ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ చెబుతారు’ అని రేవంత్ వివరించారు. ఇక ఆఫీసర్లంతా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సూచించారు.
News February 26, 2026
SRCL: ‘పదో తరగతి కీలకం.. ఒత్తిడి వీడాలి’

పదో తరగతి విద్యార్థుల జీవితంలో ఈ దశ అత్యంత కీలకమని, పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. గురువారం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె, పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని, ప్రశ్నలకు సమాధానాలు రాసిన తర్వాత మరోసారి సరిచూసుకోవాలని సూచించారు.


