News February 13, 2025
దోమకొండ: గుండెపోటుతో యువకుడి మృతి

దోమకొండ మండలం అంబర్ పేట్ గ్రామానికి చెందిన నీల అరవింద్(19) అనే యువకుడు బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. అరవింద్ తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా అరవింద్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చురుకుగా ఉంటారని స్థానికులు తెలిపారు. యువకుడి మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News December 4, 2025
WGL: తొలి విడతలో 52 పంచాయతీలు ఏకగ్రీవం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వరంగల్ జిల్లాలో 10 (రాయపర్తి 5, పర్వతగిరి 3, వర్ధన్నపేట 2), ములుగు జిల్లాలో 9, మహబూబాబాద్ జిల్లాలో 9, భూపాలపల్లి జిల్లాలో 9, జనగామ జిల్లాలో 10 (రఘునాథపల్లి 5), హనుమకొండ జిల్లాలో 5 పంచాయతీలు ఉన్నాయి.
News December 4, 2025
వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
News December 4, 2025
HYD: IITల్లో నీటిని ఒడిసిపట్టే చెరువు

రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణతో వర్షపు నీటిని ఒడిసిపట్టే పరిస్థితి తగ్గుతోంది. దీంతో ఎండాకాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన IIT HYD విద్యా సంస్థ 654 ఎకరాల ప్రాంగణంలో లోలెవెల్ ఏరియాలో చెరువును అందుబాటులోకి తెచ్చింది. అక్కడ కురిసిన వర్షపు నీరు మొత్తం ఇందులోకి వచ్చి చేరుతుంది. దీని కెపాసిటీ 2.28 కోట్ల లీటర్లుగా అధికారులు తెలిపారు.


