News February 4, 2025
దోమకొండ: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

బిక్కనూర్ మండలం జంగంపల్లి పెద్ద చెరువులో మంగళవారం గుర్తు తెలియని <<15357499>>మృతదేహం<<>> లభ్యమైంది. కాగా వివరాలను SI ఆంజనేయులు వెల్లడించారు. దోమకొండ మండలం లింగుపల్లికి చెందిన ఉప్పు భూపతి(50) సోమవారం రాత్రి ఇంట్లో గొడవపడి చెరువులో దూకి అత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి సోదరుడు యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించామన్నారు.
Similar News
News October 31, 2025
కొండాపూర్ కల్వర్టు మరమ్మతు పూర్తి చేయాలి: కలెక్టర్

కోనరావుపేట మండలంలోని కొండాపూర్ శివారులో పెంటివాగు ప్రవహించడంతో దెబ్బతిన్న లో లెవెల్ కల్వర్టును ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ గురువారం పరిశీలించారు. కల్వర్టుకు పక్కాగా మరమ్మతులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరించాలని ఆమె ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మరమ్మతులు వేగవంతం చేసి, ప్రజల ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్ సూచించారు.
News October 31, 2025
కోనరావుపేట: ‘రైస్ మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలి’

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో వెంటనే అన్లోడ్ చేసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మల్కపేటలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వడ్ల కుప్పలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. నిర్వాహకులు రైతులకు అందుబాటులో ఉండి, అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు.
News October 31, 2025
PHOTO OF THE DAY: దూరదర్శినితో DGP, CP

బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డేటా సెంటర్, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, సీపీ కార్యాలయం, హెలిప్యాడ్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. CP సజ్జనార్తో కలిసి దూరదర్శిని సాయంతో నగరాన్ని వీక్షించారు. వీరి వెంట ICCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు.


