News February 4, 2025
దోమకొండ: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

బిక్కనూర్ మండలం జంగంపల్లి పెద్ద చెరువులో మంగళవారం గుర్తు తెలియని <<15357499>>మృతదేహం<<>> లభ్యమైంది. కాగా వివరాలను SI ఆంజనేయులు వెల్లడించారు. దోమకొండ మండలం లింగుపల్లికి చెందిన ఉప్పు భూపతి(50) సోమవారం రాత్రి ఇంట్లో గొడవపడి చెరువులో దూకి అత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి సోదరుడు యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించామన్నారు.
Similar News
News February 16, 2026
శ్రీకాళహస్తి ఆలయంలో అస్వస్థతకు గురైన భక్తురాలు మృతి: YCP

శ్రీకాళహస్తి ఆలయంలో అస్వస్థతకు గురైన భక్తురాలు మృతి చెందిందని వైసీపీ ఆరోపించింది. ‘శివరాత్రి రోజున చిట్టమూరు(M) కొగిలగొల్లపాలెంకు చెందిన మణెమ్మ శివయ్య దర్శనానికి వచ్చింది. గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉండటంతో మణెమ్మ అస్వస్థతకు గురైంది. సమాచారం ఇచ్చినా సకాలంలో 108 అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో మహిళ మృతి చెందింది. ఈ పాపం మీది కాదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత?’ అని వైసీపీ విమర్శించింది.
News February 16, 2026
బంగారం ధర ₹లక్షకు తగ్గుతుందా?

అమెరికా, రష్యా మధ్య డాలర్‌తో వాణిజ్యం జరిగితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘US డాలర్‌తో ట్రేడ్‌కు రష్యా సిద్ధమవుతోందని బ్లూమ్‌బర్గ్ చెప్పింది. అదే జరిగితే 10 గ్రాముల గోల్డ్ ₹1 లక్షకు పడిపోవచ్చు. 2027 చివరి నాటికి ₹90 వేలు-₹లక్ష మధ్య స్థిరపడొచ్చు’ అని స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అన్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1.57 లక్షలుగా ఉంది.
News February 16, 2026
పోలవరం జిల్లా ప్రజలకు ముఖ్యగమనిక..!

పోలవరం జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో సోమవారం నిర్వహించవలసిన గ్రీవెన్స్ రద్దు అయ్యిందని జేసీ స్మరణ్ రాజ్ ఆదివారం తెలిపారు. శివరాత్రి సందర్భంగా ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించినందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అర్జీ దారులు ఈ విషయాన్ని గమనించాలని, రంపచోడవరం రావద్దని సూచించారు.


